భారతదేశం, ఫిబ్రవరి 11 -- నీ కంటే ముందే పెళ్లి చేసుకోని త‌ప్పు చేశామ‌ని చందుకు క్ష‌మాప‌ణ‌లు చెబుతారు సాగ‌ర్‌, ధీర‌జ్‌. మా పెళ్లిళ్లు నీ భ‌విష్య‌త్తుకు శాపంగా మారుతాయ‌ని ఊహించ‌లేద‌ని ధీర‌జ్ ఎమోష‌న‌ల్ అవుతాడు. ఇప్పుడు బాధ‌ప‌డ‌టం త‌ప్ప ఏం చేయ‌లేని నిస్స‌హాయులుగా మారిపోయామ‌ని ఆవేద‌న‌కు లోన‌వుతాడు. తాము చేసిన త‌ప్పుకు చందు కాళ్లు ప‌ట్టుకుంటాడు ధీర‌జ్‌. కావాల‌ని మీరు ఈ త‌ప్పు చేయ‌లేద‌ని, కానీ నా త‌మ్ముళ్లు క‌ల‌లో కూడా న‌న్ను బాధ‌పెట్టే ప‌ని చేయ‌ర‌ని చందు అంటాడు.

నాకు నా త‌మ్ముళ్ల ప్రేమ కంటే పెళ్లి ముఖ్యం కాద‌ని అంటాడు. ధీర‌జ్‌, సాగ‌ర్‌ల‌ను ఓదార్చుతాడు చందు. అన్న‌ద‌మ్ముల మ‌ధ్య ఉన్న ప్రేమ‌, అనుబంధాలు చూసి తిరుప‌తి సంబ‌ర‌ప‌డ‌తాడు. పెళ్లిళ్లు అయ్యి పిల్ల‌లు పుట్టిన త‌ర్వాత కూడా మీ అన్న‌ద‌మ్ములు ఇలాగే క‌లిసి ఉండాల‌ని అంటాడు.

ఉద‌యం సాగ‌ర్ లేవ‌గానే న...