Hyderabad, ఫిబ్రవరి 10 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రామరాజుకు అమ్మాయి తండ్రి కాల్ చేసి సంబంధం క్యాన్సిల్ చేస్తాడు. దాంతో రామరాజు కుంగిపోతాడు. అటువైపు సాగర్-నర్మద, ధీరజ్-ప్రేమ రొమాంటిక్ పోజులు పెడుతూ ఫొటోలు దిగుతుంటారు. మీ ఇద్దరు అబ్బాయిలు లేచిపోయి పెళ్లి చేసుకున్నారట కదా. అది చెప్పలేదు కదా. అందుకే పెళ్లి వద్దనుకుంటున్నాం అని అమ్మాయి తండ్రి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు రామరాజు.

ఇంతలో రామరాజును చూసిన మామ.. బావొచ్చాడు.. బావొచ్చాడు అనుకుంటూ రామరాజు దగ్గరికి వెళ్తాడు. పెళ్లి సంబంధం ఓకే అయినట్లేగా. ముహుర్తాలు పెట్టుకోడమే ఆలస్యమే కదా. పెద్దోడి పెళ్లికి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేయిద్దామని నేనే ఫొటోషూట్ పెట్టించాను. ఎలా ఉంది బావ నీ బామ్మర్ది క్రియేటివిటీ. పోలా.. అదిరిపోలా.. మీరు ...