భారతదేశం, ఫిబ్రవరి 6 -- 104 మంది భారతీయుల బృందం బుధవారం అమెరికా విమానాల్లో అమృత్ సర్ చేరుకుంది. వీరంతా అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్టుగా గుర్తించారు. సీ-17 గ్లోబ్‌మాస్టర్ విమానంలో వీరిని తీసుకొచ్చారు. వలస భారతీయుల్లో ఒకరైన జస్పాల్ సింగ్ ఈ మొత్తం ప్రయాణంలో తనను కాళ్లను కట్టేసి సంకెళ్లు వేశారని ఆరోపించారు. అమృత్ సర్ విమానాశ్రయంలో దిగిన తర్వాతే వాటిని తొలగించారని చెప్పారు. గురుదాస్‌పూర్ జిల్లాలోని హర్దోర్వాల్ గ్రామానికి చెందిన 36 ఏళ్ల సింగ్ జనవరి 24న అమెరికాకు వెళ్లారు. తనను అమెరికా బోర్డర్ పెట్రోలింగ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

వివిధ రాష్ట్రాలకు చెందిన 104 మంది అక్రమ వలసదారులతో అమెరికా విమానం బుధవారం ఇక్కడ ల్యాండ్ అయింది. అక్రమ వలసదారులపై అణచివేతలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వెనక్కి పంపిన తొలి బ్యాచ్ భారతీయులది. వీరిలో హర్...