భారతదేశం, ఫిబ్రవరి 15 -- హీరోయిన్ ఇలియానా ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‍ను ఆస్వాదిస్తున్నారు. 2023లో మగబిడ్డకు ఆమె జన్మనిచ్చారు. దీంతో ఇలియానా, ఆమె జీవిత భాగస్వామి మైకేల్ డోలాన్ తొలిసారి తల్లిదండ్రులయ్యారు. తన కుమారుడి ఫొటోలను చాలాసార్లు సోషల్ మీడియాలో పంచుకున్నారు ఇలియానా. మాతృత్వాన్ని ఎంత ఆస్వాదిస్తున్నానో కూడా వివరిస్తూ కొన్ని పోస్టులు చేశారు. అయితే, ఇలియనా మరోసారి ప్రెగ్నెంట్ అయ్యారంటూ కొంతకాలంగా రూమర్లు వస్తున్నాయి. ఆమె ఓ టెస్ట్ కిట్‍ వీడియోను పోస్ట్ చేయడంతో ఇవి మొదలయ్యాయి. ఈ రూమర్లను ఇప్పుడు కన్పర్మ్ చేశారు ఇలియనా.

తాను రెండోసారి గర్భంగా దాల్చానంటూ కాస్త వెరైటీగా చెప్పారు ఇలియానా. నేరుగా కాకుండా కాస్త విభిన్నంగా కన్ఫర్మ్ చేశారు. పఫ్‍కార్న్ స్నాక్స్, యాంటాసిడ్ చుయింగమ్ ప్యాకెట్స్ ఉన్న ఫొటోను ఇన్‍స్టాగ్రామ్ స్టోరీగా నేడు (ఫిబ్రవరి 15) పోస్...