భారతదేశం, ఏప్రిల్ 15 -- దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్, ఇసైజ్ఞాని ఇళయరాజా.. అనుమతి లేకుండా తన పాటలను సినిమాల్లో వినియోగించుకుంటే సహించరు. నోటీసులు పంపుతుంటారు. గతేడాది మలయాళ మూవీ మంజుమ్మల్ బాయ్స్ సినిమా మేకర్లకు నోటీసులు పంపారు. చాలా రోజుల పాటు ఈ వివాదం సాగింది. మొత్తానికి సెటిల్ అయింది. ఇప్పుడు తాాజాగా ఓ తమిళ చిత్రానికి నోటీసులు పంపారు ఇళయరాజా. తమిళ స్టార్ అజిత్ కుమార్ హీరోగా నటించిన గుడ్ బ్యాక్ అగ్లీ సినిమాకు తాఖీదులు పంపించారు.

తాను కంపోజ్ చేసిన మూడు పాత పాటలను గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో వాడేశారని మేకర్లకు నోటీసులు పంపించారు ఇళయరాజా. నట్టుపురా పట్టు మూవీ నుంచి 'ఓతా రూబైయుమ్ తారే', విక్రమ్ నుంచి 'ఇన్ జోడీ మంజల్ కురివి', సకల కళా వల్లవన్ చిత్రం నుంచి 'ఇలమై ఇదో ఇదో' పాటలను తన అనుమతి లేకుండా వాడారని ఇళయరాజా నోటీసుల్లో పేర్కొన్నారు. గుడ్ బ్యాడ్ ...