భారతదేశం, ఫిబ్రవరి 11 -- IIT Hyderabad E-Summit : ఐఐటీ హైదరాబాద్ ఈ-సెల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ-సమ్మిట్ 2025 విజయవంతం అయ్యిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సదస్సు దేశవ్యాప్తంగా ఉన్న వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు, విద్యార్థులు, పారిశ్రామిక వేత్తలను ఒకచోటకు చేర్చిందన్నారు. 'అనోమలీ' అనే థీమ్‌తో సంచలనాత్మక ఆలోచనలు, వ్యూహాత్మక నెట్‌వర్కింగ్, హై స్టేక్స్ కాంపిటేషన్ తో సదస్సును నిర్వహించారు.

ఈ సమ్మిట్‌ ప్రధానాంశాల్లో స్టార్టప్ ఫెయిర్ 2025 ఒకటి. దేశవ్యాప్తంగా ఉన్న 20 స్టార్టప్‌లు తమ ఆలోచనలను, రియల్-టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ మార్కెట్‌లో ప్రదర్శించడానికి ఈ సమ్మిట్ ఒక ప్రత్యేకమైన వేదికగా నిలిచింది. ఈ ఫెయిర్ కు హాజరైనవారు నేరుగా స్టార్టప్‌లలో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం కల్పించారు. ఈ ఫెయిర్ చిన్న స్టాక్ మార్కెట్ అనుభవాన్ని ఇచ్చిందని ఇన్వెస్టర్స్ అభిప్రాయపడ్డారు....