భారతదేశం, సెప్టెంబర్ 16 -- ఆవిష్కరణలకు చిరునామాగా నిలిచే ఐఐటీ హైదరాబాద్.. రాబోయే 6జీ టెక్నాలజీలో భారతదేశాన్ని ఒక వినియోగదారుగా కాకుండా, ఒక కీలక శక్తిగా నిలపెట్టేందుకు కృషి చేస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ టెలికమ్యూనికేషన్స్ పరిశోధకుడు, ఐఐటీహెచ్​ ప్రొఫెసర్ కిరణ్ కూచి అన్నారు.

2030 నాటికి 6జీ టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందని అంచనాలు ఉన్నాయి.

ప్రొఫెసర్ కూచి ప్రకారం.. 6జీ అంటే కేవలం "వేగవంతమైన 5జీ" మాత్రమే కాదు. దీని ప్రధాన లక్ష్యం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా.. పట్టణాలు, గ్రామాలు, ఇండోర్, ఔట్​డోర్​, భూమి, సముద్రం, ఆకాశం.. ఇలా అన్నిచోట్లా హై-స్పీడ్ కనెక్టివిటీని అందించడం!

6జీ సాంకేతికతలో ఐఐటీ హైదరాబాద్ ముందువరుసలో ఉంది. వివిధ ప్రభుత్వ సంస్థల, విభాగాల సహకారంతో, ఇప్పటికే 7 గిగాహెర్ట్జ్ బ్యాండ్​లో 6జీ ప్రోటోటైప్​లు, అడ్వాన్స్​డ్ మాసివ్...