భారతదేశం, మార్చి 31 -- అలహాబాద్ ఐఐఐటీలో తీవ్ర విషాదం జరిగింది. విద్యార్థి పుట్టినరోజు విషాదంలో ముగిసింది. తల్లికి మెసేజ్ పంపిన తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన రాహుల్ చైతన్య మాదాలగా గుర్తించారు. మార్చి 30న ఆదివారం రాత్రి రాహుల్ హాస్టల్ ఐదవ అంతస్తు నుంచి దూకాడు. పెద్ద శబ్దం రావడంతో అక్కడున్న వారు గమనించి రాహుల్‌ను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే రాహుల్ చనిపోయాడు. దీంతో అతని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం స్వరూప్ రాణి నెహ్రూ ఆసుపత్రి తరలించారు.

జేఈఈలో రాహుల్‌కు 2వ ర్యాంకు వచ్చింది. అతను అలహాబాద్ ఐఐఐటీలో చేరాడు. కానీ.. అతనికి వినికిడి, మాట్లాడే లోపం ఉంది. ఈ కారణంగా రాహుల్ తోటి విద్యార్థులతో కలిసి ఉండటానికి ఇబ్బంది పడేవాడు. ఈ క్రమంలోనే రాహుల్ తన తల్లికి మెసేజ్ పంపాడు. చదువులో ఒత్తిడి...