భారతదేశం, మార్చి 5 -- Idupulapaya IIIT : ఇడుపుల‌పాయ ట్రిపుల్ ఐటీ చెందిన విద్యార్థినిపై అధ్యాప‌కుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో విద్యార్థిని యాజ‌మాన్యానికి ఫిర్యాదు చేసింది. యాజ‌మాన్యం విచార‌ణ జ‌రిపి ఉద్యోగిపై చర్యలు తీసుకుంది. విద్యా బుద్ధులు నేర్పించాల్సిన గురువులే ఇలాంటి చ‌ర్యలకు పాల్పడ‌టం ప‌ట్ల విద్యార్థులు ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు.

ఇడుపుల‌పాయ ట్రిపుల్ ఐటీలో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న మంగ‌ళ‌వారం వెలుగులోకి వ‌చ్చింది. ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కుమార‌స్వామి గుప్తా తెలిపిన వివ‌రాల ప్రకారం నూజివీడుకు చెందిన అధ్యాపకుడు ట్రిపుల్ ఐటీలో ఒప్పంద ప్రాతిప‌దిక‌న విధులు నిర్వహిస్తున్నారు. కొద్ది రోజులుగా ఇడుపుల‌పాయ ట్రిపుల్ ఐటీకి చెందిన ఓ విద్యార్థినిని లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో ఆ విద్యార్థిని మ‌నోవేద‌న‌కు గురైంది. ఎవ‌రితోనైనా చెబితే త‌...