భారతదేశం, ఫిబ్రవరి 20 -- ICICI Bank: పర్యావరణహితమైన విధంగా కార్యకలాపాల నిర్వహణలో భాగంగా వాతావరణంలోని తేమ నుంచి తాగు నీరును ఉత్పత్తి చేసే అధునాతన సాంకేతికతను వినియోగంలోకి తెచ్చినట్లు ఐసీఐసీఐ బ్యాంకు వెల్లడించింది. వాతావరణంలోని తేమ నుంచి రోజుకు 8,000 లీటర్ల మేర వినియోగించుకోతగిన నీటిని ఉత్పత్తి చేసే సామర్థ్యం గల యూనిట్లను పలు ఐసీఐసీఐ బ్యాంకు బ్రాంచ్ ల్లో ఇన్‌స్టాల్ చేసినట్లు తెలిపింది. దీనితో బెంగళూరు, హైదరాబాద్, ముంబైలోని ఒక్కో ఆఫీసు, చెన్నైలోని రెండు ఆఫీసులు చొప్పున మొత్తం అయిదు ఆఫీసుల్లోని 4,200 మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.

అట్మాస్ఫరిక్ వాటర్ జనరేటర్లుగా (AWG) వ్యవహరించే ఈ యూనిట్లు, వాతావరణంలోని తేమను 100 శాతం సూక్ష్మక్రిములరహితమైన, స్వచ్ఛమైన, తాజా తాగు నీటిగా మార్చే వినూత్నమైన సాంకేతికతను ఉపయోగిస్తాయి. సాంద్రీకరణ ప్రక్రియతో ఆవి...