Hyderabad, మార్చి 10 -- బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారా? అయితే మీరు జిమ్‌లో లేదా పార్క్‌లో గంటల కొద్దీ సమయం ఖర్చు పెడితే మాత్రమే సరిపోదు. దానికి సమానమైన స్థాయిలో డైట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం చాలా డైట్ ప్లాన్స్ ఉన్నాయని అందరికీ తెలుసు. కానీ, ప్రస్తుతం సీజన్‌కు తగ్గట్టుగా ఐస్ హ్యాక్ డైట్ ట్రెండీగా ఉంది. మీ శరీరం చల్లని వస్తువులకు ఎక్స్‌పోజ్ అయి కేలరీలను ఖర్చు చేస్తుంది. అవి చల్లని నీరు, స్మూతీలైనా, తాజా పండ్ల రసాలైనా ఎక్కువ కేలరీలను ఖర్చు చేస్తాయి. ఈ ఐస్ హ్యాక్ కేలరీలు తగ్గుతాయి. బరువు తగ్గడానికి ఇది ఉపయోగకరమేనా?

వెయిట్ లాస్ అవడానికి ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న టెక్నిక్ ఈ ఐస్ హ్యాక్. శరీర ఉష్ణోగ్రతలు తగ్గించుకుని బరువు తగ్గే ప్రక్రియ. థర్మోజెనెసిస్ అనే ప్రక్రియతో బరువు తగ్గుతామట. ఏదైనా చల్లని వస్తువు తినడం వల్ల లేదా తాగడం వ...