భారతదేశం, మార్చి 14 -- టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ను ఐసీసీ ఆకాశానికి ఎత్తేసింది. 'భారత్ కా సికిందర్' రోహిత్ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ను విజేతగా నిలిపిన హిట్ మ్యాన్ కెప్టెన్సీని కొనియాడింది. అయితే కొన్ని రోజుల క్రితం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టీమ్ లో రోహిత్ కు చోటు దక్కలేదు. ఈ టోర్నీలో భారత్ ను విజేతగా నిలిపిన రోహిత్ ను కెప్టెన్ గానూ ఎంపిక చేయలేదు. అప్పుడు ఐసీసీ తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'సికిందర్' సినిమాపై క్రేజ్ నెలకొంది. ఇటీవల ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్, సాంగ్ బజ్ క్రియేట్ చేశాయి. ఈ క్రేజ్ ను వాడుకున్న ఐసీసీ.. రోహిత్ ను 'భారత్ కా సికిందర్' అంటూ పేర్కొంది.

'సికిందర్' అని రాసి ఉన్న రోహిత్ యానిమేటెడ్ ఫొటోను ఐసీసీ ఇన్ స్ట...