భారతదేశం, ఫిబ్రవరి 14 -- హ్యుందాయ్ మోటార్స్ తన పాపులర్ సెడాన్ 'వెర్నా' ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌పై వేగంగా పనిచేస్తోంది. కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకముందే, ఈ కారు రోడ్డు మీద టెస్టింగ్ చేస్తున్న సమయంలో కెమెరాకు చిక్కింది. ముఖ్యంగా ఈ సెడాన్​ ఇంటీరియర్స్‌కు సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో, పాత మోడల్ కంటే ఇందులో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయో స్పష్టత వచ్చింది. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..

లీకైన ఫోటోల ప్రకారం, హ్యుందాయ్​ వెర్నా ఫేస్​లిఫ్ట్​ క్యాబిన్ లోపల సంస్థ గణనీయమైన మార్పులు చేసింది:

కొత్త స్టీరింగ్ వీల్: పాత స్టీరింగ్ స్థానంలో హ్యుందాయ్ కొత్త మోడల్స్ (అయానిక్ 5 వంటివి)లో కనిపించే స్టీరింగ్ వీల్‌ను ఇందులో అందించారు. దీని మధ్యలో హ్యుందాయ్ 'హెచ్​' లోగోకు బదులుగా నాలుగు చుక్కలు ఉండటం విశేషం.

స్పోర్టీ లుక్: టెస్టింగ్ చేస్తున్న కారును గమని...