భారతదేశం, ఏప్రిల్ 4 -- Hyundai discounts: హ్యుందాయ్ ఇండియా తన హ్యాచ్ బ్యాక్, కాంపాక్ట్ ఎస్ యూవీ మోడళ్లైన ఐ20, వెన్యూ, ఎక్స్ టర్, గ్రాండ్ ఐ10 నియోస్ లపై ఏప్రిల్ నెలలో డిస్కౌంట్లను ప్రకటించింది. ఏప్రిల్ లో తమ ఉత్పత్తులపై ధరలను పెంచుతున్నట్లు గతంలో హ్యుందాయ్ ఇండియా ప్రకటించింది. అయితే ప్రస్తుతం రూ.70,000 వరకు బెనిఫిట్స్ ను అందిస్తున్నామని, ధరలను పెంచే ముందు ఈ బెనిఫిట్స్ ను పొందాలని కస్టమర్లను కోరుతోంది. ఈ బెనిఫిట్స్ లో క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ డిస్కౌంట్లు, స్క్రాపేజ్ బోనస్ వంటి ఆఫర్లు ఉన్నాయి. ఏప్రిల్ 30 వరకు ఈ డిస్కౌంట్లు వర్తిస్తాయి.

టాటా పంచ్ వంటి ప్రత్యర్థులకు పోటీగా హ్యుందాయ్ నుండి వచ్చిన ప్రసిద్ధ కాంపాక్ట్ ఎస్ యూవీ ఎక్స్ టర్. ఎక్స్ టర్ కొనుగోలుపై ఇప్పుడు రూ .50,000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. ఈ డిస్కౌంట్ ఆఫర్ లో అతితక్కువ బెనిఫిట...