భారతదేశం, ఫిబ్రవరి 12 -- దేశంలో ఆటో పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీనికి తగ్గట్టుగానే కంపెనీలు సైతం కొత్త కొత్త బ్రాండ్లను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. చాలా విదేశీ కారు బ్రాండ్లు స్థానికంగా తయారీ ప్లాంట్లను కలిగి ఉన్నాయి. మంచి అమ్మకాలను చేస్తున్నాయి. క్రెటా హ్యుందాయ్‌ను నేడు భారతదేశంలో అగ్రగామి కంపెనీగా నిలిపింది. జనవరి 2025లో ఎస్‌యూవీ అమ్మకాల్లో దుమ్మురేపింది.

హ్యుందాయ్ క్రెటా భారత ఆటోమొబైల్ మార్కెట్లో ముఖ్యమైన కారుగా ఉంది. ఇది బెస్ట్ సెల్లింగ్ వాహనాలలో స్థిరంగా తన స్థానాన్ని నిలుపుకొంది. జనవరి 2025 అమ్మకాల గణాంకాలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. హ్యుందాయ్ క్రెటా 18,522 యూనిట్ల అమ్మకాలతో మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో అగ్రస్థానంలో ఉంది. భారతదేశంలో అరంగేట్రం చేసినప్పటి నుండి జనవరి 2025లో ఇది అత్యధిక నెలవారీ అమ్మకాలను నమోదు చేసింది. ...