భారతదేశం, ఫిబ్రవరి 3 -- ఈ మధ్య కాలంలో హ్యుందాయ్‌కి ఇండియాలో క్రేజ్ తెచ్చిన కారు అంటే క్రెటా అని చెప్పొచ్చు. ఈ మేరకు 2025 జనవరి నెలలో ఎన్ని యూనిట్ల క్రెటా కార్లు అమ్ముడయ్యాయి అనే వివరాలు వెల్లడయ్యాయి. హ్యుందాయ్ 2015లో భారతదేశంలో క్రెటాను ప్రవేశపెట్టింది. క్రెటా ఇండియాలో మంచి ఆదరణ పొందింది.

2020 తర్వాత క్రెటా కార్లను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేస్తున్నందున అమ్మకాలలో పెద్దగా క్షీణత లేదు. నిజానికి గత కొన్ని సంవత్సరాలుగా బాగుంటున్నాయి. ఇది ఈ సంవత్సరం 2025లో కూడా కొనసాగుతుంది. హ్యుందాయ్ జనవరి 2025 మొదటి నెలలో మొత్తం 18,522 క్రెటా కార్లను విక్రయించింది. భారతదేశంలో ప్రారంభించినప్పటి నుండి ఒకే నెలలో అత్యధిక సంఖ్యలో క్రెటా కార్లు జనవరి 2025లోనే విక్రయించాయి.

దీంతో గత జనవరిలో క్రెటా భారత ఎస్‌యూవీ అమ్మకాల్లో తోపుగా ఉంది. జనవరి 2025లో 18,522 క్రెటా క...