భారతదేశం, అక్టోబర్ 10 -- జీఎస్టీ సంస్కరణలతో అనేక వాహనాల ధరలు భారీగా తగ్గాయి. ఆ తర్వాత, వాటి మీద అనేక సంస్థలు పండుగ ఆఫర్లు, డిస్కౌంట్​లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ హ్యుందాయ్​ మోటార్స్​ చేరింది. దీపావళి సందర్భంగా తమ పోర్ట్​ఫోలియోలోని పలు బెస్ట్​ సెల్లింగ్​ మోడల్స్​పై ఆఫర్స్​ని ప్రకటించింది హ్యుందాయ్​. ఫలితంగా, జీఎస్టీ తగ్గింపుతో పాటు ఆఫర్స్​ కారణంగా వాహనాల ధరలు మరింత దిగొచ్చాయి. ఈ నేపథ్యంలో హ్యుందాయ్​ దీపావళి ఫెస్టివల్​ డిస్కౌంట్స్​ గురించి ఇక్కడ తెలుసుకోండి..

ఇండియాలో మంచి డిమాండ్​ ఉన్న హ్యాచ్​బ్యాక్స్​లో గ్రాండ్​ ఐ10 నియోస్​ ఒకటి. ఇందులో 8 ఇంచ్​ టచ్​స్క్రీన్​, కనెక్టెడ్​ కార్​ టెక్​, వైర్​లెస్​ ఛార్జింగ్​ వంటి ఫీచర్స్​ ఉన్నాయి. సీఎన్జీ ఆప్షన్​ కూడా అందుబాటులో ఉంది.

హ్యుందాయ్​కి ఉన్న బెస్ట్​ సెల్లింగ్​...