తెలంగాణ,హైదరాబాద్, మార్చి 2 -- అమీన్‌పూర్ పెద్ద చెరువులో ఎఫ్‌టీఎల్ స‌రిహ‌ద్దుల నిర్ధార‌ణ పేరిట జ‌రుగుతున్న దందాల‌పై హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 'అమీన్‌పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల - జేఏసీ' పేరుతో ప‌లువురు దందాల‌కు పాల్ప‌డుతున్న‌ట్టు వ‌చ్చిన ఫిర్యాదుల‌ను క‌మిష‌న‌ర్ తీవ్రంగా ప‌రిగ‌ణించారు. జేఏసీ త‌ర‌ఫున కొంత‌మంది డ‌బ్బులు వ‌సూలు చేస్తున్న‌ట్టు ర‌సీదులు, వాట్సాప్ సందేశాల‌ను పరిశీలించారు.

అమీన్‌పూర్ చెరువు ఎఫ్‌టీఎల్ నిర్ధార‌ణ‌పై హైడ్రా చేస్తున్న క‌స‌ర‌త్తును ఆస‌రాగా తీసుకుని ఎవ‌రైనా దందాల‌కు పాల్ప‌డితే క‌ఠిన చ‌ర్య‌లుంటాయ‌ని క‌మిష‌న‌ర్ హెచ్చ‌రించారు. దందాల‌కు పాల్ప‌డిన‌వారిపై పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదులు చేయాల‌ని బాధితుల‌కు సూచించారు. హైడ్రా నుంచి కూడా కేసులు పెట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

అమీన్‌పూర్ చెరువులో ...