తెలంగాణ,మల్కాజ్ గిరి, ఫిబ్రవరి 14 -- గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. గురువారం మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా తూముకుంట‌ మున్సిపాలిటీ పరిధిలో కూల్చివేతలను చేపట్టింది. కోమ‌టికుంట‌లోని అక్ర‌మ నిర్మాణాల తొల‌గించింది. ఈ మేరకు హైడ్రా వివరాలను ప్రకటించింది.

హైడ్రా ప్రకటించిన వివరాల ప్రకారం.. తూముకుంట‌ మున్సిపాలిటీ, దేవ‌ర‌యాంజ‌ల్ గ్రామంలోని కోమ‌టి కుంట‌లో గురువారం అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను కూల్చివేశారు. ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో నిర్మాణాల‌పై స్థానికుల నుంచి ఫిర్యాదులు రాగా హైడ్రా చర్యలు చేపట్టింది.

ఇరిగేష‌న్‌, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారుల‌తో పూర్తి స్థాయి విచార‌ణ చేప‌ట్టిన హైడ్రా రంగంలోకి దిగింది. కోమ‌టి కుంట చెరువు ప‌రిధిలో నిర్మించిన ప్ర‌కృతి రిసార్ట్స్‌, ప్ర‌కృతి క‌న్వెన్ష‌న్ కు ఎలాంటి నిర్మాణ అనుమ‌తులు లేవ‌ని తేలింది. అలాగే ...