తెలంగాణ,హైదరాబాద్, ఫిబ్రవరి 28 -- చెరువులను పరిరక్షించటంతో పాటు పునరుద్ధరణే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. శుక్రవారం నగరంలోని పలు చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

హైడ్రా మొదటివిడతగా చేపట్టిన 6 చెరువులను హైడ్రా కమిషన్ సందర్శించారు. ఇందులో సున్నం చెరువు, తమ్మిడికుంట, కూకట్పల్లి నల్లచెరువు, ఉప్పల్ నల్ల చెరువు, భుమ్రుఖ్ ఉద్దీన్ దౌలా చెరువులు ఉన్నాయి. వీటిలో జరుగుతున్న పనుల పురోగతిపై రంగనాథ్ ఆరా తీశారు. స్థానికులతో మాట్లాడి చెరువుల పునరుద్ధరణ పనులకు సహకరించాలని కోరారు.

ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ.. నగరంలో చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ పనులకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఈ బాధ్యతను హైడ్రాకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిందని గుర్తు చేశారు. మ...