తెలంగాణ,హైదరాబాద్, ఫిబ్రవరి 12 -- చెరువుల‌లో మ‌ట్టి పోస్తున్న‌వారి స‌మాచారాన్ని తెలియ‌జేయాల‌ని హైడ్రా కోరింది. ఇందుకోసం ప్ర‌త్యేకంగా 9000113667 ఫోను నంబ‌ర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.అలాగే చెరువులో మ‌ట్టి పోస్తున్న లారీలు, టిప్ప‌ర్లు, ట్రాక్ట‌ర్లు, మ‌ట్టిని స‌ర్దుతున్న జేసీబీల‌ వీడియోల‌ను కూడా పంపించాల‌ని సూచించింది.

ఈ విషయంలో కాల‌నీ సంక్షేమ సంఘాల ప్ర‌తినిధుల‌తో పాటు.. క‌ళాశాల‌ల విద్యార్థులు, స్వ‌చ్చంద సంస్థ‌లు అంద‌రూ చేతులు క‌ల‌పాల‌ని హైడ్రా పిలుపునిచ్చింది. చెరువులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది.

రాత్రీప‌గ‌లూ నిఘా ఉంచి నెల రోజుల్లో 31 లారీలను ప‌ట్టుకుని సంబంధిత వ్య‌క్తుల‌పై కేసులు నమోదు చేసినట్లు హైడ్రా ప్రకటించింది. ఇందులో లారీ ఓన‌ర్ల‌తో పాటు.. నిర్మాణ సంస్థ‌ల‌కు చెందిన వారు కూడా ఉన్నారని తెలిపింది. ఈ నిఘాను మరింత తీవ్ర‌...