Telangana,hyderabad, ఏప్రిల్ 12 -- ఓఆర్ ఆర్ ప‌రిధిలో భూముల వివ‌రాలు అంద‌రికీ అందుబాటులోకి తీసుకురాడానికి హైడ్రా క‌స‌ర‌త్తు ప్రారంభించింది. ఎక్క‌డ చెరువు ఉంది..? ఆ చెరువు విస్తీర్ణం ఎంత‌..? కాలువలు, నాలాల‌ ప‌రిస్థితి ఏంటి..? అనే స‌మాచారంతో పాటు ప్ర‌భుత్వ భూములు, పార్కులకు సంబంధించి స‌రైన హ‌ద్దుల‌తో స‌మాచారాన్ని సేక‌రిస్తోంది.

ఈ క్ర‌మంలోనే ఎన్ ఆర్ ఎస్ సీ (నేష‌న‌ల్ రిమోట్ సెన్సింగ్ సెంట‌ర్‌)తో హైడ్రా శుక్ర‌వారం ఒప్పందం కుదుర్చుకుంది. హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌, ఎన్ ఆర్ ఎస్ సీ డైరెక్ట‌ర్ ప్ర‌కాష్ చౌహాన్ ఈ ఒప్పంద ప‌త్రాల‌పై సంత‌కాలు చేశారు. చెరువుల ఎఫ్ టీ ఎల్‌, బ‌ఫ‌ర్ జోన్ల‌కు సంబంధించి హ‌ద్దుల విష‌యంలో ఎలాంటి అపోహ‌ల‌కు ఆస్కారం లేకుండా స‌రైన స‌మాచారం అందించ‌డ‌మే హైడ్రా ముందున్న ల‌క్ష్య‌మ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ చెప్పారు.

ప్ర‌భుత్వ...