భారతదేశం, ఫిబ్రవరి 21 -- తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు లాంటి వాటిని పరిరక్షించడానికి హైడ్రాను ఏర్పాటు చేసింది. భారీ వర్షాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు.. సహాయక చర్యలు చేపట్టడం, బాధితులకు సహాయం చేయడం కూడా హైడ్రా విధుల్లో ఉన్నాయి. అంతేకాదు.. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు.. అగ్నిమాపక సిబ్బందికి సహాయం చేయాలి.

అయితే.. హైడ్రా కేవలం అక్రమ నిర్మాణాలు కూల్చివేయడంలోనే యాక్టివ్‌గా ఉందనే విమర్శలు ఉన్నాయి. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న వ్యవహారాల్లోనూ హైడ్రా తీరు సరిగా లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నాయకులు కూడా హైడ్రా తీరుపై అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా.. నిర్మాణాల కూల్చివేతల వ్యవహారంలో హైడ్రా...