భారతదేశం, మార్చి 10 -- Hydra Ranganath: మిర్యాలగూడ ప్రణయ్‌ హత్య కేసులో ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు తీర్పుపై హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ హర్షం వ్యక్తం చేశారు. ప్రణయ్‌ హత్య జరిగిన సమయంలో నల్గొండ ఎస్పీగా ఉన్న రంగనాథ్‌ నాలుగు రోజుల్లోనే నిందితుల్ని గుర్తించి అరెస్ట్ చేశారు. తాజాగా కోర్టు తీర్పుపై రంగనాథ్‌ స్పందించారు. ఎస్సీ-ఎస్టీ కేసు కావడంతో మిర్యాలగూడ డిఎస్సీ శ్రీనివాసరావు టీమ్‌ సమర్ధవంతంగా పనిచేశారని రంగనాథ్‌ చెప్పారు.

దాదాపు ఎనిమిది నెలల పాటు ప్రణయ్‌ హత్య కేసు దర్యాప్తు కొనసాగిందని, పూర్తిగా టెక్నాలజీ ఆధారంగా కేసును చేధించామని, కాల్‌ డేటా మొదలుకుని ప్రతి అంశంలో జాగ్రత్త వహించినట్టు చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం పూర్తి స్థాయిలో వాడుకున్నట్టు చెప్పారు. కేసు దర్యాప్తులో ఎక్కడా వెనక్కి తగ్గలేదని, కోట్ల రుపాయల సుపారీతో ముడిపడి ఉన్న కేసు కావడంతో దర్యాప...