భారతదేశం, ఏప్రిల్ 8 -- Hydra Commissioner : మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అల్వాల్ మండలం మచ్చబొల్లారం మోతుకుల కుంట చెరువుకు చేరువుగా ఉన్న హిందూ స్మశాన‌వాటికను మంగ‌ళ‌వారం హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌ పరిశీలించారు. హిందూ స్మశాన‌ వాటిక‌ను రామ్‌కీ సంస్థ క‌బ్జాచేసి.. అందులో చెత్త డంపింగ్ చేయ‌డంతో పరిసరాలు దుర్గంధబరితంగా మారాయని మ‌చ్చబొల్లారం రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ జాయింట్ యాక్షన్ క‌మిటీ హైడ్రాకు ఫిర్యాదు చేసింది. ఈ నేప‌థ్యంలో హైడ్రా క‌మిష‌న‌ర్ క్షేత్రస్థాయిలో ప‌ర్యటించారు. స‌ర్వే నంబ‌రు 199లో మొత్తం 15.19 ఎక‌రాల స్థలాన్ని హిందూ స్మశాన‌వాటిక‌కు కేటాయించ‌గా.. ఆ స్థలంలో రామ్‌కీ సంస్థ చెత్త డంపింగ్ చేయ‌డాన్ని , అనుమ‌తులు లేకుండా చేప‌ట్టిన నిర్మాణాల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ప‌రిశీలించారు.

మండుటెండలో పెద్ద ఎత్తున స్థానికులతో కలిసి కమిషనర్ రంగ...