భారతదేశం, డిసెంబర్ 28 -- ఐదు నెలల అనుభవాలతో.. వచ్చే ఏడాదికి రూట్ మ్యాప్ సిద్ధం చేశామని.. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వివరించారు. జీహెచ్ఎంసీ చట్టం కింద ప్రభుత్వం ప్రత్యేక అధికారులు ఇచ్చిందని చెప్పారు. ఇప్పటివరకు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించామని వెల్లడించారు. 12 చెరువులు, 8 పార్కులను అన్యక్రాంతం కాకుండా హైడ్రా రక్షించిందని వివరించారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌పై ప్రజల్లో అవగాహన పెరిగిందన్నారు.

'1095 చెరువుల్లో వచ్చే ఏడాది ఎఫ్‌టీఎల్ నిర్దారణ చేస్తాం. సాంకేతిక పరిజ్ఞానం, డాటాతో ఎఫ్‌టీఎల్ నిర్దారణ చేస్తాం. ఎఫ్‌టీఎల్‌ను పారదర్శకంగా చేయడం మా బాధ్యత. శాటిలైట్ ఇమేజ్‌తో అత్యంత రెజల్యూషన్ ఉన్న డేటా తీసుకుంటున్నాం. 2006 నుంచి 2023 వరకు ఏరియల్ డ్రోన్స్‌తో తీసిన ఫొటోలను కూడా ఎఫ్‌టీఎల్ నిర్దారణ కోసం తీసుకుంటున్నాం. ఎఫ్‌టీఎల్ మారడానికి గల కారణాలు స్పష్ట...