తెలంగాణ,హైదరాబాద్,అమీన్ పూర్, ఫిబ్రవరి 8 -- అమీన్‌పూర్‌లో స‌మ‌గ్ర స‌ర్వే చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ప్ర‌జావాణి ఫిర్యాదుల‌పై అమీన్ పూర్ లో శుక్ర‌వారం క్షేత్రస్థాయి విచార‌ణ‌ చేపట్టారు. లే ఔట్ల క‌బ్జాల‌పై ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదన్నారు. లే ఔట్ల స‌రిహ‌ద్దుల‌ను తేల్చేందుకు త్వ‌ర‌లోనే హైడ్రా స‌మ‌గ్ర స‌ర్వే చేప‌డుతుందన్నారు.

స‌ర్వే ఆఫ్ ఇండియా, ఏడీ స‌ర్వే విభాగం, రెవెన్యూ, హైడ్రా స‌ర్వే బృందాలతో అంద‌రి స‌మ‌క్షంలో పార‌ద‌ర్శ‌కంగా స‌ర్వే చేయించి లేఔట్ల స‌రిహ‌ద్దుల‌ను తేల్చుతామని రంగనాథ్ పేర్కొన్నారు. లే ఔట్ల‌లోని పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాలు క‌బ్జా కాకుండా చూస్తామని వివరించారు. అమీన్‌పూర్ మున్సిపాలిటీలో ప్ర‌భుత్వ భూమి కూడా క‌బ్జాకు గురైన‌ట్టు ఫిర్యాదులు వ‌చ్చాయని. అన్ని లెక్క‌లు తేల్చుతామన్నారు.

క్ష...