తెలంగాణ,హైదరాబాద్, జనవరి 30 -- హైదరాబాద్‌ నగర వాసులకు అలర్ట్.! ఫిబ్రవరి 1వ తేదీన పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఉండనుంది. ఈ మేరకు హైదరాబాద్ జలమండలి అధికారులు ప్రకటన విడుదల చేశారు.

నసర్లపల్లి సబ్‌స్టేషన్‌లోని 132 కేవీ బల్క్ లోడ్ ఫీడర్ మరమ్మతులు పనులు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఫిబ్రవరి 1వ తేదీన టీజీ ట్రాన్స్‌కో అధికారులు మరమ్మతులు చేపడతారని వివరించారు. దీంతో కృష్ణా ఫేజ్-1, 2, 3 నుంచి సరఫరా అయ్యే రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాల్లో ఆరు గంటల పాటు తాగునీటి సరఫరాలో పాక్షికంగా అంతరాయం ఉంటుందని తెలిపారు.

మీరాలం, కిషన్ బాగ్, శాస్త్రిపురం, సంతోష్ నగర్, వినయ్ నగర్, సైదాబాద్, చంచల్ గూడ, అస్మాన్ గఢ్, యాకుత్‌పురా, మాదన్నపేట్, మహబూబ్ మాన్షన్, భోజగుట్ట, షేక్‌పేట్, బొగ్గులకుంట, అఫ్జల్‌కుంట, శివం రోడ్డు, నారాయణగూడ, చిలకలగూడ ప్రాంతాల్లో...