తెలంగాణ,హైదరాబాద్, మార్చి 7 -- హైదరాబాద్‌ నగర వాసులకు అలర్ట్.! రేపు (మార్చి 8) పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఉండనుంది. ఈ మేరకు హైదరాబాద్ జలమండలి అధికారులు ప్రకటన విడుదల చేశారు.

HMWSSB వివరాల ప్రకారం. బీహెచ్ఈఎల్ కు సమీపంలో నేష‌న‌ల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఓ ఫ్లై ఓవ‌ర్ నిర్మిస్తోంది. ఈ పనుల వేగంగా కొనసాగుతున్నాయి. అయితే ఈ ప‌నుల‌కు ఆటంకం క‌ల‌గ‌కుండా ఉండేలా ఎన్‌హెచ్ఎఐ విన‌తి మేర‌కు అక్క‌డున్న జ‌ల‌మండ‌లి PSC పైప్‌ లైన్‌ను వేరే చోట‌కి మార్చుతున్నారు.

బిహెచ్ఇఎల్ ఫ్లైఓవర్ వద్ద 1500 ఎంఎం డయా పైప్‌లైన్‌పై జంక్షన్ పనులు చేపట్టనున్నారు. దీని కారణంగా రేపు కొన్ని చోట్ల నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అధికారులు పేర్కొన్నారు. మరికొన్ని చోట్ల తక్కువ స్థాయిలో నీటి సరఫరా జరుగుతుందని వివరించారు.

రేపు(శనివారం) ఉదయం 6 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ...