భారతదేశం, ఫిబ్రవరి 16 -- Hyderabad Water Cut: హైదరాబాద్ నగర వాసులకు అలర్ట్. 24 గంటల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని హైదరాబాద్ జలమండలి ప్రకటించింది. మహానగరానికి తాగునీరు సరఫరా చేసే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-1 లోని కొండపాక పంపింగ్ స్టేషన్ వద్ద మరమ్మతు పనులు చేయనున్నారు. ఈ పనులు 17.02.2025 సోమవారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు 18.02.2025 మంగళవారం ఉదయం 6 గంటల వరకు కొనసాగుతాయని జలమండలి అధికారులు తెలిపారు. కాబట్టి ఈ 24 గంటలు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో మంచి నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది.

1. ఓ అండ్ ఎం డివిజన్-6 : ఎస్.ఆర్.నగర్, సనత్ నగర్, బోరబండ, ఎస్పీఆర్ హిల్స్, ఎర్రగడ్డ, బంజారాహిల్స్, వెంగళరావు నగర్, ఎల్లారెడ్డిగూడ, సోమాజిగూడ, ఫతేనగర్.

2. ఓ అండ్ ఎం డివిజన్-9 : కూకట్ పల్లి, భాగ్యనగర్, వివేకానంద నగర్, ఎల్లమ్మబండ, మూసాపే...