భారతదేశం, ఏప్రిల్ 9 -- Hyderabad Water Connections : వేసవి దృష్ట్యా హైదరాబాద్ జలమండలి అధికారులు తగిన చర్యలు చేపట్టారు. తాగునీటి నల్లాలకు మోటార్లు బిగిస్తే రూ.5 వేలు జరిమానా విధిస్తామని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. దీంతో పాటు మోటార్‌ను సీజ్‌ చేస్తామని, నీటి కనెక్షన్‌ కట్‌ చేస్తామని తెలిపారు. హైదరాబాద్ నగరంలో తాగునీటి సరఫరాపై బుధవారం అధికారులతో అశోక్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్‌ 15 నుంచి వాటర్‌ స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని జలమండలి అధికారులకు సూచించారు. 'మోటార్‌ ఫ్రీ ట్యాప్‌ వాటర్‌' పేరుతో ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు.

హైదరాబాద్‌లో నీటి వృథాకు అడ్డుకట్ట వేసేందుకు జలమండలి ప్రత్యేక చర్యలు చేపట్టింది. శుద్ధి చేసిన నీటిని వృథా చేస్తూ.. ఇతర అవసరాలకు ఉపయోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. జలమండలి అధిక...