భారతదేశం, మార్చి 31 -- Hyderabad Vanguard GCC : ప్రపంచంలోని ప్రఖ్యాత ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ 'వాన్‌గార్డ్' హైదరాబాద్‌లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. వాన్‌గార్డ్ భారత్ లో నెలకొల్పే తొలి జీసీసీ ఇదే కావటం విశేషం. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వాన్‌గార్డ్ ప్రతినిధి బృందం సోమవారం సమావేశమైంది. ఈ సందర్భంగా జరిగిన చర్చల అనంతరం హైదరాబాద్‌లో జీసీసీ ఏర్పాటు చేయనున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది.

వాన్ గార్డ్ సీఈఓ సలీం రాంజీ, జీసీసీ-వాన్‌గార్డ్ ఇండియా హెడ్ వెంకటేష్ నటరాజన్ నేతృత్వంలో కంపెనీ ప్రతినిధి బృందం ఈ చర్చల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో ఉన్నారు. ఈ ఏడాది చివరి నాటికి హైదరాబాద్‌లో జీసీసీ కార్యాలయ...