భారతదేశం, మార్చి 30 -- రాష్ట్ర ప్రజలకు విశ్వావసు నామ సంవత్సరం సంతోషాలను అందించాలని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లల్లో ఉండాలని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందరికీ లభించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. భట్టి ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈ ఉగాది పచ్చడిలా షడ్రుచుల సమ్మిళితం అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.

'వ్యవసాయ అభివృద్ధికి, పేదలకు విద్య అందిచేందుకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చాం. విద్య, వైద్య, ఉద్యోగ, ఉపాధి, సంక్షేమం అన్నిటికీ బడ్జెట్ లో నిధులు కేటాయించాం. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నాం. తెలంగాణ రైజింగ్ అంటూ.. దేశంలో తెలంగాణ ఒక వెలుగు వెలగాలి. దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలవాలి. దేశంలో కొత్త నగరాల నిర్మాణం జరగాలి. అందులో భాగంగానే ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి తెలంగాణ శ్రీకారం చుట్టింది' అ...