భారతదేశం, ఫిబ్రవరి 24 -- Hyderabad Traffic : హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ నియంత్రించేందుకు జీహెచ్ఎంసీ భారీ ప్రాజెక్టును ప్రకటించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏడు స్టీల్ బ్రిడ్జిలు, ఏడు అండర్ పాస్‌లు నిర్మించాలని నిర్ణయిచింది. ఈ అభివృద్ధి పనులను మొత్తం రూ.1,090 కోట్ల అంచనా వ్యయంతో రెండు ప్యాకేజీలుగా విభజించింది. హెచ్‌-సిటీ ప్రాజెక్టులలో భాగంగా నగరంలోని పలు ప్రధాన రహదారుల్లో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది.

కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ అధికంగా ఉంటుంది. ఈ మార్గంలో ప్రయాణించే వారు గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకుంటున్నారు. ఈ సమస్యలను అధికమ...