భారతదేశం, జనవరి 30 -- హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని శిల్ప లేఅవుట్ ఫేజ్-II ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. ఈ కారణంగా గచ్చిబౌలి జంక్షన్ చుట్టూ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడనుంది. ఈ పనులు రెండు నెలల పాటు కొనసాగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. 24 గంటలు పనులు చేయనున్నారు. దీంతో పిల్లర్ నంబర్ 24 వద్ద వాహనాల రాకపోకలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

వాహనాల రద్దీని తగ్గించడానికి అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. జట్పీహెచ్ఎస్ నుండి గచ్చిబౌలి వైపు ప్రయాణించే వాహనాలను.. రోలింగ్ హిల్స్ వద్ద శిల్పా ఫ్లైఓవర్ వైపు మళ్లించాలని అధికారులు నిర్ణయించారు. అటు కాకపోతే రాడిసన్ హోటల్ మీదుగా డీఎల్ఎఫ్, ఐఐఐటీ జంక్షన్ వైపు వెళ్లాలని సూచించారు.

గచ్చిబౌలి నుండి కొండాపూర్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను.. గచ్చిబౌలి వద్ద డిఎల్‌ఎఫ్ రోడ్, రాడిసన్ హోటల్ ద్వారా మళ్లిస్తారు. ...