భారతదేశం, ఫిబ్రవరి 2 -- ట్రాఫిక్ కష్టాలు తగ్గించి వాహనదారుల సమయాన్ని ఆదాచేసేలా సైబరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు. ఓకొత్త ప్లాట్‌ఫాంని అందుబాటులోకి తెచ్చారు. ఆ నూతన విధానం ద్వారా.. ఆయా మార్గాల్లో ట్రాఫిక్ సమస్యలను ముందుగా గుర్తించే అవకాశం ఉంటుంది. ప్రయాణికులు, వాహనదారులకి సమాచారం అందిస్తారు. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అప్డేట్స్ తెలియడంతో... ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకునే అవకాశం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.

ట్రాఫిక్ పల్స్ అనే ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంను సైబరాబాద్ పోలీసులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ట్రాఫిక్ జామ్, ప్రమాదం జరిగినా, ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపు చర్యలు వంటి వివరాలను ట్రాఫిక్ పల్స్ ద్వారా వాహనదారులకు ముందుగానే పంపించనున్నారు. ఇలా ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్య స్థానాలకు చేరే అవకా...