భారతదేశం, ఫిబ్రవరి 12 -- భారతదేశంలో రైల్వే ప్రయాణికులే అధికం. అయితే కొన్ని నగరాలకు వెళ్లేందుకు ఇప్పటికే బుల్లెట్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. వీటితో చాలా వరకు ప్రయాణికుల సమయం ఆదా అవుతుంది. హైస్పీడ్ కారిడార్లలో భాగంగా బుల్లెట్ రైళ్లు చాలా వరకు ఉపయోగకరంగా ఉన్నాయి. ఇప్పుడు రైల్వే శాఖ హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై నగరాలకు హైస్పీడ్ రైలు కారిడార్ నిర్మించాలని అనుకుంటోంది. దీంతో చాలా మందికి ప్రయోజనం చేకూరనుంది.

ప్రస్తుతం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి విమాన ప్రయాణానికి ఒక గంట 15 నిమిషాలు పడుతుంది. హైదరాబాద్ నుంచి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి ఒక గంట 20 నిమిషాలు పడుతుంది. విమానాశ్రయం నుండి నగరంలోని వివిధ ప్రదేశాలకు చేరుకోవడానికి సుమారు 2-3 గంటలకు పెరుగుతుంది. అయితే ఈ సమయంలో హైదరాబాద్...