భారతదేశం, జనవరి 2 -- దేశానికి స్వాతంత్ర్యం రాకముందే హైదరాబాద్ సంస్థానం చాలా రిచ్. స్వాతంత్ర్యం వచ్చాక.. భాగ్యనగరంలో వేలాది ఎకరాల ప్రభుత్వ ఆస్తులు ఉండేవి. అప్పటికే దేశంలో ఎక్కడా లేనివిధంగా కట్టడాలు, నిర్మాణాలు హైదరాబాద్‌లో వెలిశాయి. ఆ తర్వాత కాలక్రమేనా పరిశ్రమల అభివృద్ధి, ఫార్మా రంగం అభివృద్ధి హైదరాబాద్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చింది. సైబర్ టవర్స్ నిర్మాణం, ఐటీ ఎగుమతులు హైదరాబాద్ అభివృద్ధి బంగారు బాటలు వేశాయి.

ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు హైదరాబాద్ అభివృద్ధికి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాయి. తద్వారా నగర అభివృద్ధితో పాటు.. భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా హైదరాబాద్ ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంతో.. నగర రూపురేఖలు మారిపోయాయి. గతంలో ఉన్న నగరం కంటే.. దాదాపు 10 నుంచి 15 కిలోమీటర్ల మేర అభివృద్ధి చెందింది.

తాజాగా.. రీజన...