భారతదేశం, ఫిబ్రవరి 20 -- Hyderabad RRR : రీజిన‌ల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ద‌క్షిణ భాగం(చౌటుప్పల్‌-అమ‌న్‌గ‌ల్‌-షాద్‌న‌గ‌ర్‌-సంగారెడ్డి- 182 కి.మీ) జాతీయ ర‌హ‌దారి ప్రక‌ట‌న‌కు సంబంధించిన అడ్డంకులు తొల‌గిపోయాయి. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగాన్ని ఇప్పటికే జాతీయ ర‌హ‌దారిగా ప్రక‌టించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా సీఎం రేవంత్ రెడ్డిజాతీయ ర‌హ‌దారుల శాఖ మంత్రి నితిన్ గ‌డ్కరీతో స‌మావేశ‌మైన త‌ర్వాత ఆర్ఆర్ఆర్ ద‌క్షిణ‌ భాగాన్నిజాతీయ ర‌హ‌దారిగా ప్రక‌టించేందుకు ప్రతిపాద‌న‌లు కోరాల‌ని ఎన్‌హెచ్ఏఐ అధికారుల‌ను ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ అంశంతో పాటు తెలంగాణ‌లో జాతీయ ర‌హ‌దారుల(National Highways) విస్తర‌ణ‌కు అనుమ‌తి, ప‌లు ముఖ్యమైన రాష్ట్ర ర‌హ‌దారుల‌ను జాతీయ ర‌హ‌దారులుగా అప్‌గ్రేడ్ చేయాల‌ని కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) విజ్ఞప్తి చేశారు. రాష...