భారతదేశం, ఏప్రిల్ 1 -- తెలంగాణలో యువతులపై అత్యాచారయత్నం, అత్యాచారం ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల నాగర్‌కర్నూలు జిల్లాలో జరిగిన ఘటన మరువక ముందే.. హైదరాబాద్‌లో కామాంధుడు రెచ్చిపోయాడు. విదేశీ యువతిని రేప్‌‌ చేశాడు. పహాడీ షరీఫ్‌ దగ్గర జర్మనీ యువతిపై అత్యాచారం జరిగినట్టు తెలుస్తోంది. కారులో ఎక్కించుకున్న డ్రైవర్ మార్గమధ్యంలో యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని తన స్నేహితుడి వద్దకు వెళ్తున్న 25 ఏళ్ల జర్మన్ యువతిపై.. పహాడిషరీఫ్‌లోని మామిడిపల్లి వద్ద అత్యాచారం జరిగింది. విమానాశ్రయానికి వెళుతుండగా క్యాబ్ డ్రైవర్ అత్యాచారం చేశాడని పోలీసులు చెప్పారు. ఈ ఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ మహిళ తన స్నేహితురాలితో పాటు మరికొంతమందితో కలిసి న...