భారతదేశం, ఏప్రిల్ 15 -- హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, మణికొండ, నార్సింగి ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. టోలిచౌకి, రాజేంద్రనగర్, షేక్‌పేట్, శంషాబాద్ ఏరియాల్లోనూ ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది. భారీ వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. దీని వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రానున్న కొన్ని గంటల్లోనూ వర్షం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ వాన పడింది. వ...