భారతదేశం, జనవరి 10 -- సైబర్ మోసాలకు గురైన బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవచ్చు. ఆ దిశగా హైదరాబాద్ నగర పోలీసులు సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు.బాధితులకు సహాయపడటానికి రూపొందించిన వర్చువల్ హెల్ప్ డెస్క్ 'సి-మిత్ర'ను శుక్రవారం ప్రారంభించారు. దేశంలోనే ఈ తరహా సేవలు రావటం ఇదే తొలిసారి అని హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు.

"హైదరాబాద్ లో సైబర్ నేరాల బాధితులు ఇకపై ఫిర్యాదు కోసం పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సిన పనిలేదు. ఏం రాయాలి? ఏ సెక్షన్లు వర్తిస్తాయి? అన్న ఆందోళన చెందాల్సిన అవసరమూ లేదు. బాధితులకు అండగా నిలుస్తూ, ఇంటి నుంచే ఎఫ్ఐఆర్ నమోదు చేసుకునేలా దేశంలోనే తొలిసారిగా 'సీ-మిత్ర' పేరుతో వినూత్న విధానాన్ని ప్రారంభించడం జరిగింది. కృత్రిమ మేథా (ఏఐ) సహకారంతో పనిచేసే ఈ వర్చువల్ హెల్ప్‌డెస్క్ ద్వారా ఫిర్యాదు ప్రక్రియ సులభ...