భారతదేశం, ఏప్రిల్ 4 -- హైదరాబాద్ నగరంలో నిర్వహించే శ్రీరామనవమి శోభాయాత్రకు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉందని, శోభాయాత్రను శాంతియుతంగా, ప్రశాంతంగా నిర్వహించుకోవాలని నగర సీపీ సీవీ ఆనంద్‌ సూచించారు. శ్రీరామనవమి శోభా యాత్ర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివిధ శాఖల అధికారులతో సీతారాంబాగ్‌లోని ద్రౌపది గార్డెన్‌లో సమన్వయ సమావేశం నిర్వహించారు. సీపీ సీవీ ఆనంద్‌ పలు సూచనలు చేశారు.

1.శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా.. 20 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశామని సీపీ సీవీ ఆనంద్ వివరించారు.

2.శోభాయాత్రలో షీటీమ్స్‌, సీసీఎస్‌, టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందితో పూర్తిస్థాయిలో నిఘా ఏర్పాటు చేశామని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. శోభాయాత్రను డ్రోన్‌లు, సీసీ కెమెరాలతో కమాండ్‌ కంట్రోల్‌ రూం నుంచి పర్యవేక్షిస్తామని తెలిపారు.

3.సీ...