భారతదేశం, మార్చి 4 -- బంగ్లాదేశ్‌లో పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. అక్కడి యువత ఉపాధి కోసం ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. వారి అవసరాన్ని కొందరు దళారులు క్యాష్ చేసుకుంటున్నారు. డబ్బులు తీసుకొని మన దేశంలో ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తున్నారు. దీంతో అక్రమంగా దేశంలోకి వచ్చి వివిధ నగరాల్లో వారు నివాసం ఉంటున్నారు. అయితే.. వీరితో ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు రాష్ట్రాలను హెచ్చరిస్తున్నాయి.

తాజాగా మన హైదరాబాద్‌లో కొందరు బంగ్లాదేశ్ యువకులు పోలీసులకు పట్టుబడ్డారు. ఆధార్, ఓటరు గుర్తింపు కార్డులతో నగరానికి చేరి డ్రైవింగ్‌ లైసెన్స్‌ సొంతం చేసుకుంటున్నారు. బైక్‌ ట్యాక్సీలను నడుపుతూ.. డబ్బులు సంపాదిస్తున్నారు. వీరు పశ్చిమ బెంగాల్‌ ద్వారా హైదరాబాద్‌ వచ్చినట్టు తెలుస్తోంది. అటు బంగ్లా యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును నగర టాస్క్‌ఫో...