భారతదేశం, ఫిబ్రవరి 3 -- ఈమధ్య కాలంలో లోన్ యాప్‌ల వేధింపులకు ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి. బాధితుల్లో ఎక్కువగా యువత, విద్యార్థులు, మహిళలే ఎక్కువగా ఉంటున్నారు. తీసుకున్న రుణం పూర్తిగా తిరిగి చెల్లించినా.. ఇంకా బాకీ ఉందంటూ ఫొటోలు మార్ఫింగ్‌ చేసి సైబర్‌ నేరగాళ్లు బెదిరిస్తున్నారు. దీంతో బాధితులు మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు కీలక సూచనలు చేశారు. 'ఫేక్ లోన్ యాప్స్‌తో జరభద్రం. ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా లోన్స్ అంటే ఆశ పడకండి. నకిలీ లోన్ యాప్స్‌ని నమ్మకండి. ఫేక్ లోన్ యాప్స్ మిమ్మల్ని సర్వం దోచేస్తాయి. మీ ఫోన్ లోని వివరాలను సర్వర్‌లో లోడ్ చేసుకుంటాయి. ఈజీగా లోన్ వస్తుందని వెళ్లి చిక్కుల్లో పడకండి. ఫేక్ లోన్ యాప్స్‌పై అవగాహన కల్పించండి. ఎలాంటి ఫ్రాడ్ మీ దృష్టికి వచ్చినా.. 1930 టోల్ ఫ్రీ న...