భారతదేశం, జనవరి 15 -- సంక్రాంతి వేళ పతంగుల జోరు కొనసాగుతోంది. అయితే చైనా మాంజా వాడకంపై హైదరాబాద్ నగర పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెడుతున్నారు. ఎక్కడైనా అమ్మినట్లు సమాచారం అందితే చాలు. కేసులు నమోదు చేసి అరెస్టులు కూడా చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సాధారణ దారాలను మాత్రమే వాడాలని.. చైనా మాంజాను వాడొద్దని స్పష్టం చేస్తున్నారు.

చైనా మాంజా విషయంపై హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ ప్రత్యేకంగా ప్రకటన విడుదల చేశారు. పతంగుల జోరు.. ఇతరుల పాలిట యమపాశం కావొద్దని సూచించారు. "సంక్రాంతి అంటేనే సంబరం. ఏడాదికోసారి వచ్చే ఈ పండుగ నాడు ఆకాశమంతా రంగురంగుల పతంగులు ఎగరేయడం మన ఆనవాయితీ. కానీ, కొందరి నిర్లక్ష్యం వల్ల ఈ పండుగ పక్షులకు, వాహనదారులకు శాపంగా మారుతోంది. పండుగ పూట మీకున్న ఆనందం.. ఇతరుల ఇంట విషాదం నింపకూడదు" అని కోరారు.

"చైనా మాంజాపై సంపూర్ణ నిషేధం ఉంది. న...