తెలంగాణ,హైదరాబాద్, మార్చి 8 -- హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మనువడు కనిష్క్ రెడ్డి(19) ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన గురువారం రాత్రి జరిగింది. ఆ వెంటనే ఆస్పత్రికి తరలించగా. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి.

డాక్టర్ తీగల అజిత్ రెడ్డి - సునరితా రెడ్డి పెద్ద కుమారుడు కనిష్క్ రెడ్డి. ఇతను టెక్‌ మహీంద్ర యూనివర్సిటీలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. గురువారం రాత్రి ఫ్రెండ్ ఇంట్లో జరిగిన ఫంక్షన్ కు కారులో వెళ్లాడు. తిరిగి వస్తున్న క్రమంలో. ఔటర్‌ రింగ్‌రోడ్డుపై గొల్లపల్లె కలాన్‌ వద్ద ప్రమాదానికి గురయ్యాడు. ముందు వెళుతున్న లారీని ఢీకొనడంతో కనిష్క్ రెడ్డి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది.

ఘటనపై సమాచారం అందుకున...