తెలంగాణ,హైదరాబాద్, ఫిబ్రవరి 14 -- తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ అయిన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపలి ఏరియా అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ ప్రాంతాన్నీ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన డ్రోన్ సర్వేను కోర్ అర్బన్ ఏరియా అంతటా నిర్వహించాలని సూచించారు.

గురువారం నానక్‌రామ్‌గూడలోని హెచ్ఏండీఏ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కోర్ అర్బన్ ఏరియా అభివృద్ధి అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. కోర్ అర్బన్ ఏరియాను అభివృద్ధి చేయటంతో పాటు హైదరాబాద్ నగరవాసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలన్నారు. నగరంలో కొత్తగా మరో 7 ఫ్లైఓవర్లు నిర్మించాలన్న ప్రతిపాద...