భారతదేశం, ఫిబ్రవరి 27 -- హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. అటు ఓఆర్ఆర్ అవతల వెస్టర్న్ హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో వాహనాల రాకపోకలు భారీగా పెరిగాయి. ఫలితంగా ట్రాఫిక్ కష్టాలు పెరుగుతున్నాయి. ఈ కష్టాలను తగ్గించడానికి హెచ్ఎండీఏ కీలక నిర్ణయం తీసుకుంది. నానక్‌రామ్‌గూడ ఇంటర్‌ ఛేంజ్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించే ప్రయత్నం చేస్తోంది.

వాహనాల రద్దీని తగ్గించడానికి కొత్త ఎగ్జిట్‌ను నిర్మిస్తున్నారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చేసిన సూచనల ప్రకారం.. నానక్‌రామ్‌గూడ ఇంటర్‌ ఛేంజ్ దాటిన తర్వాత, నార్సింగి టోల్ ప్లాజా ముందు కొత్త ఎగ్జిట్‌ను నిర్మిస్తున్నారు. దీని నిర్మాణం దాదాపు 90 శాతం పూర్తయింది, మార్చిలో దీనిని ప్రారంభించాలని హెచ్ఎండీఏ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

కొత్త ఎగ్జిట్ లక్ష్యం రద్దీని తగ...