భారతదేశం, మార్చి 31 -- హైదరాబాద్ ఔటర్ రింగ్‌ రోడ్డుపై టోల్‌ ఛార్జీలు పెరగనున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త టోల్‌ ధరలు అమల్లోకి రానున్నాయి. కారు, జీప్, వ్యాన్‌లకు కిలోమీటర్‌కు 10 పైసలు, మినీ బస్, ఎల్‌సీవీలకు కిలో మీటర్‌కు 20 పైసలు, బస్సు, 2 యాక్సిల్ బస్సులకు రూ.6.69 నుంచి రూ.7కి పెంచారు. భారీ వాహనాలకు కిలోమీటరుకు రూ.15.09నుంచి రూ.15.78కి పెరిగింది. ఈ ఛార్జీల పెంపుపై వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా సంస్థ టోల్ వసూలు చేస్తోంది. హెచ్ఎండీఏ పరిధిలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ నిర్వహణలో ఉండే ఓఆర్ఆర్​ను.. ఐఆర్​బీ సంస్థ 30 ఏళ్ల కాలానికి లీజుకు తీసుకుంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పొడవు 158 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) దీన్ని నిర్మించింది. రూ.6,696 కో...